దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెడిసిన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల వైఫల్యం కారణంగా మెడిసిన్స్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని అంది. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేటు హాస్పిటల్స్ కు ప్రోత్సాహకంగా మారిందని చురకలంటించింది. ప్రైవేటు హాస్పిటల్స్ పేషెంట్లు వారి బంధువులను బలవంతంగా ఎక్కువ ధరలు ఉన్న మందులను కొనే విధంగా చేస్తున్నాయని దాఖలైన పిటిషన్ పై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమ ఫార్మసీల నుండే పేషెంట్లు మెడిసిన్ కొనేలా వారిని బలవంతం చేయకుండా ప్రైవేటు హాస్పిటల్స్ కు ఆదేశాలు జారీ చేయాలని పిటీషనర్ కోరారు. వీటిని కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని దాంతో పేషెంట్లు దోపిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. ధర్మాసనం ఈ వాదనతో ఏకీభవించింది. పేషెంట్స్ కు సూచించిన మెడిసిన్ వేరే చోట తక్కువ ధరకు లభిస్తుందనే తమ వద్దే కొనుగోలు చేయాలని హాస్పిటల్స్ బలవంతం చేయకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ముఖ్యంగా సమాజంలోని పేద వర్గాల వారికి అత్యవసర మెడిసిన్ అందుబాటులో లభించడం కష్టమైంది ఈవిధంగా కాకుండా తగిన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్రాల వైఫల్యం కారణంగానే… మెడిసిన్స్ ధరలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
By admin1 Min Read