మా ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచలేదు, పెంచబోము..పెరిగిన చార్జీలు అన్నీ, వైసీపీ ప్రభుత్వంలో పెంచి వెళ్ళిన చార్జీలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మీరే పెంచి వెళ్ళిన చార్జీలపై, మీరే ఆందోళన చేయటం వింతగా ఉందని వైసీపీ సభ్యులపై అసెంబ్లీలో మండిపడ్డారు. మీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకి ఏడాదికి రూ.10 వేల కోట్లు ఖర్చు పెడితే, మా ప్రభుత్వం గత 9 నెలల్లో ఆ ఖర్చుని 60% తగ్గించింది. తాము ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసి, ప్రజలపై భారం పడకుండా చూస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు.
మా ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచలేదు,పెంచబోము: మంత్రి గొట్టిపాటి రవికుమార్
By admin1 Min Read