ముంబైకి చెందిన పరిశోధకులు బ్లడ్ క్యాన్సర్‌కు కొత్త చికిత్సను అభివృద్ధి చేశారు.సీఏఆర్ టీ-సెల్ థెరపీ ద్వారా క్యాన్సర్‌పై సమర్థవంతంగా పోరాడే విధానాన్ని కనుగొన్నారు.ఈ చికిత్స భారతీయులపై పరీక్షించగా, 73 శాతం రోగుల్లో ఇది విజయవంతమైంది.టాటా మెమోరియల్ హాస్పిటల్, ఐఐటీ-బాంబే పరిశోధకులు ఈ థెరపీని అభివృద్ధి చేశారు.టీ-సెల్స్ అనేవి రోగనిరోధక కణాలు,ఇవి క్యాన్సర్‌పై పోరాడేందుకు సహాయపడతాయి.క్లినికల్ ట్రయల్స్‌లో మొదటి దశలో 14 మంది, రెండో దశలో 50 మంది రోగులపై పరీక్షలు నిర్వహించారు.పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ చికిత్స ఇతర దేశాలలో లభ్యమయ్యే చికిత్సల కంటే తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది.
లాన్సెట్ హెమటాలజీ జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురించబడింది.బీ-సెల్ లుకేమియా, లింపోమా వంటి రకాల క్యాన్సర్‌లకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు.11 ఏళ్ల పరిశోధనలో భాగంగా టాలికాబ్టజీన్ ఆటోల్యూసెల్ ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేశారు.రోగులకు పునర్జన్మ లాంటి ఈ చికిత్స త్వరలో మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

