అమెరికాలోని కొన్ని విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్ కార్యాలయం నుండి వీసా రద్దు ఈమెయిల్స్ అందాయి.‘బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా’ పేరుతో పంపిన ఈమెయిల్స్‌లో విద్యార్థులను స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.క్యాంపస్ ఆందోళనల్లో పాల్గొనడం లేదా వాటి చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కారణంగా తెలుస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.ఇది భావ ప్రకటనా స్వేచ్ఛపై పరిమితి విధించే చర్యగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అనుమానాస్పద సోషల్ మీడియా పోస్టులను అమెరికా అధికారులు గమనిస్తున్నట్టు సమాచారం.ఈమెయిల్స్‌లో వీసా రద్దు వివరాలతో పాటు కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించనున్నట్టు పేర్కొన్నారు.స్వచ్ఛందంగా వెళ్లిపోకుంటే అరెస్టు చేసి భవిష్యత్తులో వీసా నిరాకరణకు గురిచేస్తామని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది.
ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులకు వీసా రద్దు నోటీసులు పంపిస్తున్న అమెరికా…!
By admin1 Min Read