స్వదేశీ టెలికాం టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ఇప్పటి వరకు చైనా, ఫిన్లాండ్, స్వీడన్, దక్షిణ కొరియాలకు మాత్రమే ఈ టెక్నాలజీ ఉండేదని తెలిపారు.2014లో 90 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య 1.2 బిలియన్లకు పెరిగిందన్నారు.అలాగే, ఇంటర్నెట్ యూజర్లు 97 కోట్లకు చేరారని, ఇది అమెరికా జనాభాకంటే ఎక్కువ అని వివరించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) లక్ష స్వదేశీ 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటుచేస్తోందని, వీటిని త్వరలో 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు.ప్రభుత్వం డైరెక్ట్-టు-డివైస్ (DTD) ఉపగ్రహ సేవలను ప్రారంభించిందని, దీనివల్ల నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా ఉపగ్రహం ద్వారా సందేశాలు పంపడం సాధ్యమవుతుందని తెలిపారు.ఇప్పటికే రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్‌కు ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవల కోసం లైసెన్స్‌లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
స్వదేశీ టెలికాం టెక్నాలజీ కలిగిన టాప్ 5 దేశాలలో భారత్:- కేంద్రమంత్రి సింధియా ఒకటి :-
By admin1 Min Read

