వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఎవరూ ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అసదుద్దీన్ ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా ఈ బిల్లు ఆగదని, ఆయన తాత వచ్చినా నిలిపివేయలేరని విమర్శించారు. ముస్లిం సమాజం, మేధావులు వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. కరీంనగర్‌లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం రూ. 15 లక్షలు మంజూరు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ బిల్లును మతపరంగా చూడడం సరైంది కాదని,ఇది ప్రజల కోసం తీసుకొస్తున్న బిల్లు అని స్పష్టంచేశారు.వక్ఫ్ బోర్డు పేరుతో పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరీంనగర్‌లో ఓ పేద వ్యక్తి ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి రద్దయ్యిందని ఉదాహరణగా తెలిపారు.ఈ బిల్లును అడ్డుకోవడానికి ఒవైసీ సహా కొందరు లౌకికవాదులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.గతంలో పాకిస్థాన్ జెండాలు ఎగురవేయడం,కోర్టు ముందు చెట్లు తొలగించిన ఘటనలపై పోరాటాల్లో జైలుకెళ్లిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.తాను ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే పోరాడతానని తెలిపారు.వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు త్వరలో ఆమోదం పొందుతుందని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
వక్ఫ్ బోర్డు బిల్లును ఎవరూ ఆపలేరు: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
By admin1 Min Read