భారీ భూకంపాలతో కుదేలైన మయన్మార్ కు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఇటీవల మయన్మార్, థాయ్ ల్యాండ్ లు భూకంపంతో బెంబేలెత్తిపోయాయి. లక్షల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య 1000 దాటింది. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన మయన్మార్ కు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ ‘బ్రహ్మ’ తో మయన్మార్ కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు ఆహార ప్యాకెట్లను పంపింది. ఐఎన్ఎస్ సాత్పురా మరియు ఐఎన్ఎస్ సవిత్రి 40 టన్నుల అవసరమైన మానవతా సహాయాన్ని యాంగోన్ పోర్ట్‌కు తీసుకుని వెళ్లాయి. అలాగే భారత్ 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడి తరలించి సహాయక చర్యల్లో తన వంతు సాయం అందించనుంది. అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా తగిన సాయం అందిస్తామని తెలిపాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నట్లు యూ.ఎన్ (ఐక్యరాజ్యసమితి ) జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ తెలిపారు.
భూకంప ప్రభావిత మయన్మార్ కు భారత్ ఆపన్నహస్తం ‘ఆపరేషన్ బ్రహ్మ ‘
By admin1 Min Read