ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఓ ఆసక్తికరమైన వీడియోను తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఎకౌంటు లో పోస్ట్ చేశారు. ఢిల్లీ లో ఓ వ్యక్తి తన కారులో వెళుతూ… రోడ్డు పక్కన ఉన్న ఒక గోవుకు రొట్టెను విసిరేశాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న సీఎం అది గమనించారు. వెంటనే తన కాన్వాయ్ నుండి నేరుగా ఆ వాహనదారుడి వద్దకు వెళ్లి తనని తాను ఆ వ్యక్తితో పరిచయం చేసుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఆ ఆవుకు మీరు రోటీ విసిరేయడం చూశాను. అలా చేయడం సరికాదు. అది మన సంస్కృతి కూడా కాదు. మనం ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం. దాన్ని అలా రోడ్డుపై విసిరేయడం సరి కాదు. దానికోసం ఆ ఆవు రోడ్డుపైకి వస్తుంది. దాంతో రోడ్డు ప్రమాదం జరగొచ్చు. అది ఆవుతో పాటు మనషులకు కూడా ప్రమాదమే. మరోసారి ఆవిధంగా చేయొద్దని సీఎం రేఖా అభ్యర్థించారు. ఆహారాన్ని అగౌరవపరచకూడదు. మీరు జంతువులకు ఆహారం ఇవ్వాలనుకుంటే, దయచేసి గోశాల లేదా వాటికి కేటాయించిన ప్రత్యేక ప్రదేశంలో ఇవ్వండి అని సూచించారు. ఇది మన బాధ్యత, విలువలకు సంకేతమని రేఖ గుప్తా ఢిల్లీ వాసులకు ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేశారు.
आज राजधानी में भ्रमण के दौरान, मैंने देखा कि एक व्यक्ति ने अपनी कार से रोटी सड़क पर फेंकी- संभवतः गाय को खिलाने के उद्देश्य से। मैंने गाड़ी रुकवाई और उस व्यक्ति से आग्रह किया कि कृपया ऐसा दोबारा न करें।
रोटी हमारे लिए केवल भोजन नहीं है, वह हमारी संस्कृति, श्रद्धा और सम्मान का… pic.twitter.com/PS0bYmOBG6— Rekha Gupta (@gupta_rekha) April 12, 2025