సముద్ర గర్భాన్ని మానవుల జీవనావాసంగా మార్చడామే లక్ష్యంగా పనిచేస్తున్న బ్రిటన్‌కు చెందిన డీప్ (DEEP) అనే స్టార్టప్ ముందుకు సాగుతోంది.భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనలతో పాటు మానవుల నివాసానికి కూడా సముద్రం కీలకమవుతుందని సంస్థ చెబుతోంది.2050 నాటికి సముద్ర గర్భంలో మానవ జననాలు జరగేలా చేయడమే వారి దీర్ఘకాల లక్ష్యం.ఇటీవల ఒక బయోమెడికల్ ఇంజినీరు 100 రోజుల పాటు సముద్రంలో నివసించిన ప్రయోగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.ఈ ప్రయోగం ఆధారంగా,సముద్రంలో మానవుల నివాసం సాధ్యమా? అన్న ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.డీప్ కంపెనీ వాన్‌గార్డ్ అనే త్రీడీ ప్రింటెడ్ మెటల్ హ్యాబిటాట్‌ను త్వరలో ఆవిష్కరించనుంది.
ఇది 325 అడుగుల లోతు వరకు తట్టుకునేలా రూపొందించబడింది.మూడు మంది డైవర్లు స్వల్పకాలిక పరిశోధనల కోసం ఇందులో ఉండగలుగుతారు.తర్వాతి దశలో సెంటినెల్స్ అనే నివాస గృహాలను 656 అడుగుల లోతులో నిర్మించనున్నారు.ఇందులో పడకగదులు, వంటగది,మరుగుదొడ్లు, ప్రయోగశాలలు ఉంటాయి.భూమిపై ఉండే ఇండ్ల మాదిరిగానే ఇవి కూడా పనిచేస్తాయని సంస్థ విశ్వాసం.2035 నాటికి పది భారీ సముద్ర గర్భ నివాస కేంద్రాలను నిర్మించాలన్నది డీప్ లక్ష్యం.ఇదే లక్ష్యంతో 2050 నాటికి సముద్ర గర్భంలోని ఇంటిలో మానవ జననం జరగే విధంగా ప్రణాళికలు రచిస్తోంది.1950-60 దశకాల్లో ఇలాంటి ప్రయత్నాలు జరిగినా,డీప్ ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో మళ్లీ ఆ కలను నిజం చేయాలనుకుంటోంది.