భారత రాజవంశానికి చెందిన గోల్కొండ బ్లూ డైమండ్ త్వరలో వేలం వేయనున్నారు.గోల్కొండ గనుల్లో లభించిన ఈ అరుదైన నీలి వజ్రం 23.24 క్యారెట్స్ బరువు కలిగి ఉంది.దీని విలువ సుమారుగా రూ.300 కోట్లు నుంచి రూ.430 కోట్ల వరకు ఉండొచ్చని వజ్రాల డిజైనింగ్ సంస్థ జార్ వెల్లడించింది. ఈ బ్లూ డైమండ్‌ను అమెరికాలోని క్రిస్టీస్ సంస్థ మే 14న స్విట్జర్లాండ్‌లోని జనీవా నగరంలో వేలం వేయనుంది.ఒకప్పుడు ఇది ఇండోర్ మహారాజుకు చెందిన ఉంగరంలో పొదిగిఉండేది. ఇప్పుడు అదే ఉంగరం వేలానికి రావడం అరుదైన పరిణామంగా చర్చనీయాంశమైంది.డైమండ్ రంగంలో ప్రఖ్యాతమైన క్రిస్టీస్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేలం అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది. గోల్కొండ గనులు ఇటీవలి శతాబ్దాల్లో ప్రపంచాన్ని దిమ్మతిరిగే వజ్రాలను అందించిన ప్రసిద్ధికెక్కిన ప్రదేశాలు.ఈ డైమండ్ భారత ప్రాచీన వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.వేలం ద్వారా ఈ వజ్రానికి నూతన యజమాని లభించనున్నాడు.
Previous Articleచంద్రుని శక్తితో విద్యుత్ తయారీ….!
Next Article అక్రమంగా ఉన్న విదేశీయులను వెనక్కి పంపిన భారత్…!