వీసాల గడువు ముగిసిన తర్వాత కూడా భారతదేశంలో అక్రమంగా ఉండిపోయిన 15 మంది విదేశీయులను అధికారులు గుర్తించి దేశం నుంచి పంపించేశారు.వీరిలో 12 మంది నైజీరియన్‌లు, ఇద్దరు బంగ్లాదేశీయులు, మరొకరు ఐవరీ కోస్ట్‌కు చెందినవారు ఉన్నారు.ఢిల్లీలోని మోహన్ గార్డెన్, ఉత్తమ్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు వీరిని పట్టుకున్నారు.ఆ తర్వాత వీరిని డిటెన్షన్ కేంద్రాలకు తరలించి, విచారణ నిర్వహించారు.విచారణలో వీరు వీసా గడువు దాటినా స్వదేశాలకు తిరిగి వెళ్లకుండా అక్రమంగా నివసిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. దాంతో ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ఆదేశాల మేరకు వీరిని స్వదేశాలకు పంపారు.ఈ చర్యను అధికారులు గట్టిగా అమలు చేస్తూ, దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి అజాగ్రత్తలూ తీసుకోబోమని స్పష్టం చేశారు. దేశ భద్రతను కాపాడేందుకు ఇలాంటి ఆపరేషన్‌లు కొనసాగుతాయని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు