ఇటీవల కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత బృందం నేడు వాటికన్ సిటీకి బయల్దేరి వెళ్లింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజాలతో కూడిన భారత ప్రతినిధి బృందం కూడా వాటికన్‌కు వెళ్లారు.
ఏప్రిల్ 21న పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికన్‌లో ఏప్రిల్ 26న జరగనున్న ఆయన అంత్యక్రియల కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఆమె వాటికన్ లో పర్యటించనున్నారు. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళులర్పించి, సంతాపం తెలియజేస్తారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 25న వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా వద్ద దివంగత పోప్‌కు రాష్ట్రపతి పుష్పాంజలి ఘటిస్తారు. ఏప్రిల్ 26న సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగే అంత్యక్రియల ప్రేయర్స్ కు రాష్ట్రపతి హాజరుకానున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వాటికన్ వెళ్లిన భారత రాష్ట్రపతి
By admin1 Min Read