పహాల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ పై పలు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఆ దేశం నుండి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో పాక్ అడ్డ దారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంకల మీదుగా వాటిని భారత్ కు పంపించాలనే వంకర బుద్ధిని చూపుతోంది. దీంతో కస్టమ్స్ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఈ మేరకు పలు ఇంగ్లీష్ మీడియా కథనాలు వెలువడ్డాయని తెలుస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు పాకిస్థాన్ నుండి వచ్చే ఏ వస్తువైనా ఏ మార్గం నుంచైనా భారత్ లోకి రాకుండా అడ్డుకునేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి అధికారిక మార్గాల్లో పాక్ నుంచి భారత్ కు దిగుమతి అయ్యే వస్తువుల విలువ చాలా తక్కువే. అయితే, మూడో దేశం మీదుగా పాక్ నుంచి అనేక ఉత్పత్తులు భారత్ కు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కేంద్రం ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులన్నింటినీ నిషేధిస్తున్నట్లు మే 2న ఆదేశాలు జారీ చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు