ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన ఐదు వేర్వేరు సంఘటనలలో తమిళనాడుకు చెందిన 24 మంది భారతీయ జాలర్లు ఎదురుకున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశం మరియు శ్రీలంక ప్రభుత్వాలు పరస్పర సహకార స్ఫూర్తితో ఈ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాణాత్మక మరియు నిరంతర సంభాషణలో పాల్గొనడం అత్యవసరమని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ శాఖకు తన పోస్ట్ ట్యాగ్ చేశారు. నాగపట్నం జిల్లాకు చెందిన ఈ జాలర్లు సముద్రంలో జరిగిన ఘర్షణల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గాయపడ్డారని తెలుసుకోవడం బాధాకరం, ఇది వారి జీవనోపాధిని కూడా ప్రభావితం చేసిందని తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం మరియు శ్రీలంక మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా, పునరావృతమయ్యే ఈ సంఘటనలను గమనించి, ఈ పరిస్థితులను స్నేహపూర్వకంగా పరిష్కరించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు.
భారతీయ జాలర్ల సమస్యలపై కేంద్ర విదేశాంగ శాఖకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విన్నపం
By admin1 Min Read