మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ ఈరోజు తెల్లవారుజామున వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. ఈ పరిణామం ప్రాంతీయంగా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక కేంద్రాలు, సైనిక కమాండ్ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాదాపు 15 అణు వార్‌హెడ్ లకు సరిపడా క్లీన్ చేసిన యురేనియం స్టోర్ చేసిందని, ప్రయోగించగల అణ్వాయుధాన్ని తయారు చేయడానికి కేవలం కొన్ని నెలల దూరంలో ఉందని తెలుస్తోంది . ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. ఇది తమ ఆత్మరక్షణ కోసం తీసుకున్న చర్యగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ దాడుల అనంతరం ఇరాన్ నుండి ప్రతీకార దాడులు జరగవచ్చన్న ఆందోళనతో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ దేశవ్యాప్తంగా ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ఇజ్రాయెల్ -ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు: ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
By admin1 Min Read