భారతీయ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్ష అనుభవాలు భారత్ చేపట్టనున్న ‘గగన్ యాన్’ ప్రాజెక్టుకు చాలా అవసరమని ప్రధాని మోడీ అన్నారు. ఇటీవలే అంతరిక్ష యాత్ర చేసి తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లా ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శుభాంశు శుక్లాను అభినందించారు.
2040లోపు మనం మరో 40 నుంచి 50 మంది ఆస్ట్రోనాట్ లను తయారుచేసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. భారత్ చేపట్టబోయే గగన్ యాన్ ప్రాజెక్టుపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోందని దీనిలో భాగం కావడానికి అనేకమంది శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారని శుక్లా ప్రధానికి తెలిపారు. ప్రధాని మోడీతో జరిగిన భేటీకి సంబంధించి శుక్లా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ప్రధాని మాట్లాడుతూ.. గగన్ యాన్ ప్రాజెక్టుకు శుంభాంశు అంతరిక్ష యాత్రతో తొలి అడుగు పడిందన్నారు.
భారత్ చేపడుతున్న అంతరిక్ష సంస్కరణలకు, ఆశయాలకు సహాయకారిగా ఉంటుందని మోడీ శుక్లాతో అన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు స్పేస్ ప్రోగ్రామ్ లో ‘గగన్ యాన్’ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇందులో భాగంగా అంతరిక్షం నుంచి తాను తీసిన కొన్ని చిత్రాలను భేటీ సమయంలో శుక్లా ప్రధానికి ట్యాబ్లెట్ కంప్యూటర్ లో చూపిస్తూ వాటి గురించి వివరించారు. అంతరిక్ష అనుభవాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, గగన్ యాన్ మిషన్ వంటివాటిపై చర్చించారు.
కీలక అంశాలపై ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాతో చర్చించిన ప్రధాని మోడీ
By admin1 Min Read
Previous Articleపీ4 అమలు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Next Article మరో కీలక భారీ ప్రాజెక్ట్ పై పనిచేస్తున్న ఇస్రో