ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరో భారీ ప్రాజెక్ట్ కు సన్నద్ధమవుతోంది. 40 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు భారీ రాకెట్ ను నిర్మించే పనిలో నిమగ్నమైనట్లు ఇస్రో చైర్మన్ వి.నిరాయణన్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కాన్వకేషన్ కు హాజరైన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఏడాది నావిక్ శాటిలైట్, ఎన్1 రాకెట్ ప్రయోగం, అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన కమ్యునికేషన్ శాటిలైట్ ను కక్ష్యలోకి చేర్చడం వంటి ప్రాజెక్టులు చేపట్టనుందన్నారు. అబ్దుల్ కలామ్ గారు తయారు చేసిన తొలిరాకెట్ 17 టన్నుల లిఫ్ట్ బరువుతో.. 35 కిలోల ఉపగ్రహాన్ని దిగువ భూకక్ష్యకు చేర్చింది. కానీ, నేడు 75,000 కిలోల బరువైన పేలోడ్‌ను దిగువ భూకక్ష్యకు చేర్చడంపై పనిచేస్తున్నామని వివరించారు. అందుకు అవసరమైన రాకెట్ 40 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం భారత్ కు కక్ష్యలో 55 ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే మూడు లేదా నాలుగేళ్లలో వీటి సంఖ్య మూడు లేదా నాలుగు రెట్లు పెరగనుందన్నారు. ఇస్రో ప్రస్తుతం టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ శాటిలైట్ (టీడీఎస్), నేవీ కోసం సిద్ధం చేసిన జీశాట్-7ఆర్ ప్రయోగించనుంది. ఇది ఇప్పటికే కక్ష్యలో ఉన్న జీశాట్-7 (రుక్మిణి) స్థానాన్ని రీప్లేస్ చేయనుంది.
Previous Articleకీలక అంశాలపై ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాతో చర్చించిన ప్రధాని మోడీ
Next Article ఢిల్లీ సీఎం పై దాడి!… పోలీసుల అదుపులో వ్యక్తి