బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఈరోజు తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు చేసింది.అయితే ఈ తుపానుకు ‘ఫెంగల్’గా నామకరణం చేసింది.సైక్లోన్ ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మయిలాదుతురై, తిరువారూర్, నాగపట్టణం,చెన్నై,తిరువళ్లూర్,కాంచీపురం,చెంగల్‌పేట్,కడలూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) పేర్కొంది.ఈ మేరకు ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.తమిళనాడు వ్యాప్తంగా రేపటి వరకు ఓ మాదిరి వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు