గిరిపుత్రుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గిరి ఆరోగ్య కేంద్రాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. డోలీల మోతలకు స్వస్తి పలకాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కంటైనర్ ఆస్పత్రినుంచి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలసలో దీనిని ప్రారంభించారు.
ఈ ఆస్పత్రి ద్వారా గిరిజనుల ఆరోగ్య సమస్యలు చాలా వరకు తీరుతాయి. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు మైదాన ప్రాంతాలకు రావాల్సిన పనిలేదని మంత్రి వివరించారు.గర్భిణులకు, వృద్ధులకు, అత్యవసర సమయాల్లో సత్వర వైద్యం అందుతుంది. ఈ గిరి ఆరోగ్య కేంద్రంలో రెండు రోజులు పీహెచ్ సీ డాక్టర్లు.. మూడు రోజులు ఏఎన్ఎం, ఎంఎల్ హచ్ పీలు ఓపీ సేవలు అందిస్తారని మంత్రి ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
మలేరియా, డెంగ్యూ సహా 14 రకాల వైద్య పరీక్షలు ఇక్కడ చేస్తారు. టీకాలు కూడా అందుబాటులో ఉంటాయి. అవసరం మేరకు అక్కడికక్కడే 105 రకాల మందులు అందిస్తారని పేర్కొన్నారు. అలాగే 104 మెడికల్ యూనిట్ కూడా వారానికి ఒక రోజు ఈ ఆస్పత్రి వద్దకే వచ్చి సేవలు అందిస్తుందని చెప్పారు.
ఇలాంటి వినూత్న ఆలోచన చేసిన మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ గారికి, ఇతర అధికారులకు అభినందనలు తెలిపారు. త్వరలోనే మరిన్ని గిరి ఆరోగ్య కేంద్రాలను రాష్ట్రమంతటా ఏర్పాటు చేసేందుకు మా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
Previous Articleఎర్రచందనంకు సంబంధించి అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
Next Article తమిళనాడుకు ‘ఫెంగల్’ తుఫాన్ ముప్పు