వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమితో తాము పొత్తుకు సిద్ధంగా లేమని వెల్లడించింది.ఒంటరిగానే పోటీ చేస్తామని పేర్కొంది.ఈ మేరకు ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తులకు దూరంగా ఉంటుందని,ఒంటరి పోరుకు సిద్ధమైనట్లు మీడియా సమావేశంలో తెలిపారు.
ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ చేసిన ప్రకటన వల్ల ఇండియా కూటమికి గట్టి షాక్ తగిలింది.అయితే ఈ సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిరాకరించిన విషయ తెలిసిందే.13 స్థానాల్లో ఒంటరిగా పోటీలోకి దిగింది.అయితే ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా పోటీ చేస్తామని కాంగ్రెస్ కూడా ప్రకటన చేసింది.ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాము ఒంటరిగా వెళ్తామని చెప్పింది.