భువనేశ్వర్ లోని లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన డీజీపీలు, ఐజీపీల మూడు రోజుల సదస్సులో ప్రధాని మోడీ ఆఖరి రోజు పాల్గని మాట్లాడారు. 59వదైన ఈ సదస్సులో దేశ భద్రతకు సంబంధించిన పలు అంశాలపై కీలక మేధో మథనం జరిగింది. మావోయిస్టుల నియంత్రణ, ఉగ్రవాదం కట్టడి, సైబర్ నేరాల నిరోధం,మహిళలపై జరుగుతున్న దాడులు, జల మార్గాలలో పటిష్ట బందోబస్తు వంటి వాటిపై తీర్మానాలు జరిగాయి. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, ఏఐ టెక్నాలజీపై జరుగుతున్న అక్రమాలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ వంటి వాటితో జరుగుతున్న నష్టాలను ప్రస్తావించారు. వీటిని కట్టడి చేసే చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. స్మార్ట్ పోలీసింగ్ ను అమలు చేయాలని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.
డీజీపీలు, ఐజీపీల సదస్సులో పోలీసింగ్, భద్రతకు సంబంధించి వివిధ అంశాలపై చర్చ: పాల్గొన్న ప్రధాని మోడీ
By admin1 Min Read
Previous Articleఅరుదైన ఘనత సాధించిన తెలుగు తేజం అర్జున్
Next Article కుమారుడికి క్షమాభిక్ష.. జో బైడ్ న్ కీలక నిర్ణయం