బంగ్లాదేశ్‌లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొని ఉన్న విషయం తెలిసిందే.హిందువులతోపాటు వారి దేవాలయాలపైనా వరుస దాడులు జరుగుతున్నాయి. ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోన్న ఈ దాడులను ఉద్దేశించి ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు.న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమానికి ఆమె వర్చువల్‌గా హాజరైనట్లు తెలుస్తోంది.బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనసేను ఉద్దేశించి ఆమె ఇందులో కీలక ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.ఈమేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.‘మా దేశంలో జరుగుతోన్న వరుస హత్యలకు కారణం నేనేనంటూ…ఇప్పుడు నాపై పలు కేసులు పెడుతున్నారు.కానీ వాస్తవానికి ఆరోజు విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనలకు దిగింది మహమ్మద్ యూనస్.ప్రార్థనా మందిరాలపై దాడులు, అల్లర్లలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం, మాస్టర్ మైండ్ యూనస్‌దే’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల కారణంగా ఆమె స్వదేశాన్ని వదిలిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆమె భారత్‌లోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ దాడులు…అతడిదే మాస్టర్ మైండ్: షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
By admin1 Min Read