కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎమ్.కృష్ణ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో కన్నుమూశారు. యాభై ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పాత్ర పోషించారు.1932 మే1 న కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లా సోమనహాళ్లిలో జన్మించిన ఆయన 1962లో ఎన్నికల్లో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా మద్దూర్ నుండి గెలిచి 30 ఏళ్లకే శాసనసభలోకి ప్రవేశించారు. 1989-93 శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. 1993-94లో డిప్యూటీ స్పీకర్ గా కూడా ఉన్నారు. 1999-2004 మధ్య కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2004-2008 వరకు మహారాష్ట్ర గవర్నర్ గా పని చేశారు. 2009-12 మధ్య విదేశాంగ మంత్రిగా ఉన్నారు. 1971-2014 వరకు పలుమార్లు లోక్ సభ, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేశారు. 2017లో బీజేపీ లో చేరారు. గతేడాది రాజకీయాల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఇక ఎస్.ఎమ్.కృష్ణ మృతి పట్ల ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Previous Articleనాకు ప్రాణహనీ ఉంది:- మంచు మనోజ్
Next Article న్యూ ఢిల్లీ రాజకీయాల్లో పుష్ప 2 పోస్టర్లు హవా…!