ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 31న పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
జనవరి 1న నూతన సంవత్సరం నేపథ్యంలో ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో 31వ తేదీనే పెన్షన్ల పంపిణీని చంద్రబాబు ఆ గ్రామం నుండి ప్రారంభించనున్నారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు.
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో యల్లమంద గ్రామంలో సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ యల్లమంద గ్రామంలో పర్యటించారు. అక్కడ హెలిపాడ్ నిర్మాణానికి అనువైన స్థలంతో పాటు సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులతో సమీక్షించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు