నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై పవన్ స్పందన
తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.మనతో ప్రయాణం చేసి శ్రమించిన వారని తాను గుర్తించాలని అన్నారు.తనతోపాటు సమానంగా నాగబాబు పనిచేశారని…వైసీపీ వాళ్లు ఎన్నోసార్లు అవమానించినా ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు.కులం, బంధుప్రీతి ఇక్కడ ప్రమాణీకం కాదని..పనిమంతుడా కాదా అనే విషయాన్నే తాను చూస్తానని స్పష్టత నిచ్చారు.ఎంపీగా ప్రకటించి.. ఆయన్ని తప్పించామన్నారు.ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చామన్నారు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తామని తెలిపారు.
Previous Articleమస్క్ కి తోడుగా ట్రంప్…!
Next Article భోపాల్ లో 40 ఏళ్లుగా పడివున్న విషపదార్థాల తరలింపు