స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చెయ్యాలని సొంతంగా గనులు కేటాయించాలని మాజీ మంత్రి, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలని లేదంటే కార్మికులతో కలసి ఉద్యమం చేస్తామని చెప్పారు. మొదటి నుండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కార్మికులు కేంద్రం ఇచ్చే ప్యాకేజీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదు? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వ్యతిరేకించడం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని కేంద్రమంత్రి వెల్లడించారన్నారు. ఇక సీఎం చంద్రబాబు అసమర్థత వల్లే తిరుపతి దుర్ఘటన జరిగిందని విమర్శించారు. కోట్లాది మంది వచ్చిన కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది మరణించారని ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ కనిపించలేదని దుయ్యబట్టారు . తిరుపతి సంఘటనపై కోర్టులు సుమోటుగా కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. తిరుపతి ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని లేఖ రాసినట్లు తెలిపారు.
ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి:శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ
By admin1 Min Read