తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకులతో ఆపార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ విధానాలు, పథకాల అమలు తీరు, పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈసందర్భంగా చర్చించారు. మార్చి 12న వైసీపీ ఆవిర్భావ కార్యక్రమంతోపాటు ఆ రోజు పార్టీ ఆధ్వర్యంలో ‘ఫీజు పోరు’ ఉన్నందున వైద్య కళాశాలల ప్రైవేటుపరం, వైద్య సీట్ల కుదింపుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజా సమస్యలే ఎజెండాగా పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలను రూపొందించాలని జగన్ నేతలకు సూచించారు. సంపద సృష్టిస్తానని కబుర్లు చెప్పిన చంద్రబాబు.. కేవలం అప్పులతో కాలం వెల్లదీస్తున్నతీరుని ఎండగట్టాలని దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మోసాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండని పేర్కొన్నారు.
Previous Articleప్రభాస్ ‘ఫౌజీ’ సాయి పల్లవి ?
Next Article బెంగళూరులో యష్ ‘టాక్సిక్’ చిత్రీకరణ..!