తలసేమియా వ్యాధి పై అవగాహన కల్పించే లక్ష్యంతో, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు తమన్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ను నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఎవరైనా టికెట్ కొంటేనే వారికి లోపలికి అనుమతి అని స్పష్టం చేశారు. ఫండ్ రైజింగ్ కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిని నిర్వహించేందుకు తమన్ ముందుకొచ్చారని చెప్పారు. తమ కుటుంబ సభ్యుల కోసం చంద్రబాబు రూ.6 లక్షలు పెట్టిన టికెట్లను కొని టేబుల్ బుక్ చేశారని పేర్కొన్నారు. ‘సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ‘ అని నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన స్ఫూర్తితోనే ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరూ రక్త దాన కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల మరొకరి జీవితంలో వెలుగులు నింపుతారని అన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇక ఈ ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. ఆయన వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు