ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను మంత్రి పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రకారం, 15% వృద్ధి లక్ష్యంగా పని చేసేలా ప్రతి డిపార్టుమెంటు ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసారని పేర్కొన్నారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారాన్ని ప్రయారిటీగా తీసుకుని, త్వరితగతిన పరిష్కారం చూపించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ పరిగణనలోకి తీసుకుని, తగు మార్పులు చేసుకుంటూ పాలన సాగించాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 158 సేవలు అందిస్తున్నామని, వచ్చే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింతగా విస్తరిస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రికి వివరించారని తెలిపారు. వాయిస్ ఎనేబుల్డ్ సేవలతో పాటుగా, ప్రజల ఫీడ్ బ్యాక్ ని కూడా వాట్సాప్ ద్వారా అందించేలా చూడాలని సీఎం సూచించారు.
15% వృద్ధి లక్ష్యంగా పని చేసేలా ప్రతి డిపార్టుమెంటు ప్రణాళిక ఉండాలని సీఎం దిశానిర్దేశం
By admin1 Min Read
Previous Articleయుద్ధ విమానాన్ని నడిపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Next Article ఆకట్టుకుంటున్న ‘శివ శివ శంకర’ సాంగ్…!