ఏపీని మాజీ సీఎం జగన్ అప్పుల కుప్పగా మార్చడం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.ఈ మేరకు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీల నేతలు సమన్వయంతో కలిసి ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.కాగా వెన్ను నొప్పి కారణంగానే తాను కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని చెప్పారు.అయితే ఇప్పటికీ వెన్ను నొప్పి బాధిస్తోందని ఆయన తెలిపారు.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తోందని అన్నారు.అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమని పవన్ కల్యాణ్ చెప్పారు.తనకి ఇచ్చిన మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్నానని అన్నారు.