సినీ నటుడు,మాజీ వైసిపి నేత పోసాని కృష్ణమురళిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు.ఈ మేరకు రైల్వే కోడూరు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.కాగా పోసానికి ఖైదీ నంబర్ 2261ని జైలు అధికారులు కేటాయించారు.పోసానిని నిన్న రాత్రి 9 గంటల వరకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో విచారించారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టారు.
అయితే ఉదయం 5 గంటల వరకు కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయని తెలుస్తోంది. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.పోసానికి బెయిల్ ఇవ్వాలని కోరారు.అయితే అందుకు నిరాకరించిన జడ్జి…పోసానికి రిమాండ్ విధించారు.కాగా వచ్చే నెల 13తేదీ వరకు పోసాని రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు.ఈ కేసు విచారణ సందర్భంగా పోసానిపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.మహిళల గురించి పోసాని చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయని తెలిపింది.