మున్సిపాల్టీలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖామంత్రి పొంగూరు నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏప్రియల్ నుండి మున్సిపాల్టీల నిధులు ఆయా మున్సిపాల్టీల అభివృద్దికి మాత్రమే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం అయిందని అమరావతిపై అవాస్తవాలతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణం కోసం ప్రజలపై ఒక్క రూపాయి కూడా.భారం వేసేది లేదని స్పష్టం చేశారు. ఇంజినీర్ల కమిటీ నిర్ణయం మేరకే టెండర్ ధరల నిర్ధారణ అని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ తో అమరావతి పనులు ఆలస్యం అవుతున్నాయని వివరించారు. త్వరలోనే అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
మున్సిపాల్టీల నిధులు ఆయా మున్సిపాల్టీల అభివృద్దికి మాత్రమే: మంత్రి నారాయణ
By admin1 Min Read