ఎలాన్ మస్క్ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ను భారత్ కు తీసుకొచ్చేందుకు రిలయన్స్ జియో తయారైంది. ఈ మేరకు స్పేస్ ఎక్స్ తో ఒప్పందం చేసుకుంది. భారత్‌లో స్టార్ లింక్ ఇంటర్నెట్‌ను అందించేందుకు స్పేస్ ఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఎయిర్ టెల్ కూడా తాజాగా చెప్పింది. ఒక్క రోజులోనే జియో నుండి కూడా ఈ ప్రకటన రావడం గమనార్హం. అందరికీ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ అందేలా చూసేందుకు ఈ భాగస్వామ్యం ఒక కీలక అడుగు. జియో బ్రాడ్ బ్యాండ్ వ్యవస్థతో స్టార్ లింక్ ను అనుసంధానించడం ద్వారా మా రేంజ్ ను మరింత విస్తరించనున్నాం. ఈ ఒప్పందం ఏఐ ఆధారిత యుగంలో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ విశ్వసనీయతను పెంచనుందని పేర్కొంది. జియో తన రిటైల్ అవుట్లెట్లు, ఆన్లైన్ వేదికగా స్టార్ లింక్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ రెండు సంస్థలు పరస్పరం తమ ప్రయోజనాల దృష్ట్యా ముందుకుసాగనున్నాయని తన ప్రకటనలో పేర్కొంది. భారత్ అంతటా, మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ యాక్సెస్ ను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు