సావరిన్ గోల్డ్ బాండ్స్ ను ఎనిమిది సంవత్సరాల క్రితం కొన్న వారికి జాక్ పాట్ లభించనుంది. 2016-17 సిరీస్ ఫోర్ బాండ్లకు సంబంధించి రిడెంప్షన్ డేట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. మార్చి 17ను మెచ్యూరిటీ డేట్ గా ప్రకటించింది. దీంతో అప్పట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మూడింతల లాభం చేకూరుతుంది. దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలనే లక్ష్యంతో 2015 నవంబర్‌లో ఆర్.బీ.ఐ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు. 2017 మార్చిలో జారీ చేసిన 4వ విడత బాండ్ల మెచ్యూరిటీ ధరను తాజాగా ఆర్.బీ.ఐ ప్రకటించింది. ఆ సమయానికి గ్రాముకు రూ.2,943 చొప్పున బాండ్లను జారీ చేయగా, ప్రస్తుత ధరను రూ.8,624గా నిర్ణయించారు. దీని ప్రకారం, అప్పట్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు దాదాపు రూ.3 లక్షలు దక్కనున్నాయి. దీనికి అదనంగా, బాండ్లపై ఏటా 2.50 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. గ్రాము ధరను నిర్ణయించడానికి, మెచ్యూరిటీ తేదీకి ముందు వారం రోజులపాటు 999 స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధరను ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా, 2019-20 సిరీస్-4 సంబంధించిన ప్రీ-మెచ్యూరిటీ విండోను కూడా మార్చి 17గా నిర్ణయించారు. దీనికి గ్రాము ధరను రూ.8,634గా నిర్ణయించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు