గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ తనదైన శైలిలో దాతృత్వ సేవలు కొనసాగిస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటివరకు 4,500 ఆపరేషన్లు చేయించారు. ఈ సంఖ్య తాజాగా 4,500 దాటినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మహేష్ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో ఆయనను ప్రశంసిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. తమ అభిమాన హీరో చేస్తున్న సమాజ సేవ పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మహేశ్ బాబు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇక మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్‌తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు.
Previous Articleవిజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ కొత్త సినిమా…!
Next Article ఏపీ సీఐడీ కస్టడీకి పోసాని కృష్ణమురళి…!

