వైఎస్సార్ జిల్లాను తిరిగి వైఎస్సార్ కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేకపోయినా.. కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్సార్ పేరును తీసెయ్యడాన్ని ఖండిస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. అనాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉండగా స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత వైయస్ పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటుందని ఆరోపించారు. కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను ఇది గాయపరిచిందని ఆమె ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. వైఎస్సార్ అంటే ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. వైఎస్సార్ జిల్లాలో తిరిగి కడప పేరు చేర్చినప్పుడు విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు ఎన్టీఆర్ విజయవాడ అనో లేక పాత కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు.
అనాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారు: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read
Previous Articleపంత్ కు టీమ్ నుండి 100% మద్దతు: నికోలస్ పూరన్
Next Article వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా

