ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా జనసేన సీనియర్ నేత నాగబాబు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు నాకు అవకాశం కల్పించి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా బాధ్యతలు అప్పజెప్పిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సూచనలకు అనుగుణంగా తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రజా సంక్షేమం, జవాబుదారీతనం ప్రధాన లక్ష్యాలుగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వంలో శాసన మండలి సభ్యునిగా నా కర్తవ్యాలను క్రమశిక్షణతో నిర్వహిస్తామని చెప్పారు. చట్టసభలో ప్రజా ప్రతినిధిగా ప్రజాగళం వినిపించే అవకాశం లభించేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మండలి చైర్మన్ మోషేస్ రాజు నాగబాబు చేత ప్రమాణస్వీకారం చేయించారు. కూటమి నేతలు ఈసందర్భంగా నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తా: ఎమ్మెల్సీ నాగబాబు
By admin1 Min Read