వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. కాగా వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకంగా ఓటు వేసిందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. తాజాగా దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి స్పందించారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేయాలని మా పార్టీ విప్ జారీచేసింది. మేం వ్యతిరేకించాము అనడానికి లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన ఉభయసభల కార్యకలాపాలే సాక్ష్యం.రాజ్యసభలో వక్ఫ్ బిల్లు పై నేను చేసిన ప్రసంగం మరొక ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. బిల్లును మేం వ్యతిరేకించలేదు అని నిరూపించే దమ్ము మీకు ఉందా? అని టీడీపీకి సవాల్ చేశారు. ఫేక్ న్యూస్‌ల మీద రాజకీయాలు చేసే అలవాటు వారికి ఎలాగూ ఉందని దుయ్యబట్టారు.
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేయాలని మా పార్టీ విప్ జారీచేసింది. మేం వ్యతిరేకించాము అనడానికి లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన ఉభయసభల కార్యకలాపాలే సాక్ష్యం.
రాజ్యసభలో వక్ఫ్ బిల్లు పై నేను చేసిన ప్రసంగం మరొక ప్రత్యక్ష సాక్ష్యం. pic.twitter.com/WIMuM24VsO— Y V Subba Reddy (@yvsubbareddymp) April 4, 2025