ఈ నెల 15 నుంచి ఇంటింటికీ మన మిత్ర ద్వారా వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టనుంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించనున్నారు. ప్రజలకు అవగాహన పెంచేలా ప్రత్యేక కరపత్రం, వీడియో సందేశం ఉండనుంది.జిల్లా కలెక్టర్లకు కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నారు. తదుపరి దశలో 1000కిపైగా సేవల కల్పించాలన్నది ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకునేలా కార్యక్రమం రూపకల్పన చేశారు. ఇప్పటికే ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 250కి పైగా సేవలందిస్తుంది.జూన్ నెలకు 500కుపైగ సేవల అందించాలనే దిశగా చర్యలు చేపడుతున్నారు. పౌరులందరూ తమ మొబైల్ ఫోనులో మనమిత్ర పేరిట 9552300009 నంబరును సేవ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

