విశాఖ కేజీహెచ్‌లో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఈదర పెద్ద వీర్రాజు గారు వినూత్న తరహాలో తెలుగుభాష గొప్పతనంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈనేపథ్యంలో ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈమేరకు ‘ఎక్స్’ లో ఆయన వీడియోను పోస్ట్ చేశారు. పెద్ద వీర్రాజు గారి ప్రయత్నం అభినందనీయమని పేర్కొన్నారు . యువతరంలో మాతృభాష పట్ల ఆసక్తి తగ్గడంపై ఆయన వ్యక్తం చేస్తున్న ఆందోళన సహేతుకమైనదేనని దేశభాషలందు తెలుగులెస్స అన్న శ్రీకృష్ణ దేవరాయలు మాటని ఆదర్శంగా తీసుకుని తెలుగు కవిత్వం, పద్యాలు, నైతిక బోధనల ద్వారా తెలుగు మాధుర్యాన్ని నేటితరానికి తెలియజేసేందుకు వీర్రాజు గారు ఎంచుకున్న మార్గం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
విశాఖ కేజీహెచ్‌లో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఈదర పెద్ద వీర్రాజు గారు వినూత్న తరహాలో తెలుగుభాష గొప్పతనంపై ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయం. యువతరంలో మాతృభాష పట్ల ఆసక్తి తగ్గడంపై ఆయన వ్యక్తం చేస్తున్న ఆందోళన సహేతుకమైనదే. దేశభాషలందు… pic.twitter.com/gNUUITQC2Y
— Lokesh Nara (@naralokesh) April 11, 2025