ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ నియామకాలను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 ఎస్జీటీ, 1,124 స్కూల్ అసిస్టెంట్ నియామకాలు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటిజం అలాగే మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం ఈమేరకు జీవో జారీ చేసింది.
Previous Articleఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Next Article జడ్జినే నిందితుడిగా భావించిన ఎస్‌ఐ…!