సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలను విడతల వారీగా తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ప్రకటించారు.ఈ రోజు నుండి ప్లాట్‌ఫాం 5, 6లను 13 రోజుల పాటు, అనంతరం ప్లాట్‌ఫాం 3, 4లను 50 రోజుల పాటు మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 60 రైళ్లకు మార్పులు చేపట్టారు.సికింద్రాబాద్ నుంచి నడిచే 30 రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి టర్మినళ్లకు దారి మళ్లించగా, ఇతర టర్మినల్స్ నుంచి 8 రైళ్లను చర్లపల్లి స్టేషన్‌కు మార్చారు.ప్రయాణికులు ముందస్తుగా తమ రైళ్ల గమ్యస్థానాలను నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు.ఆధునికీకరణ అనంతరం స్టేషన్ మరింత అభివృద్ధి చెందనుందని రైల్వే శాఖ పేర్కొంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా విడతల వారీగా ప్లాట్‌ఫాంల మూత..!
By admin1 Min Read
Previous Articleఢిల్లీ వాయు కాలుష్యం ప్రమాదకరం – 3 రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్లు వచ్చే పరిస్థితి:కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
Next Article బోయింగ్ విమానాల కొనుగోలు నిలిపిన డ్రాగన్…!