దీర్ఘకాలిక కొల్లేరు సమస్యను పరిష్కరించాల్సిందిగా కేంద్ర అటవీ శాఖా మంత్రి భుపేంద్ర యాదవ్ కు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. మంత్రి సత్య కుమార్ తో పాటు కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు కూడా ఉన్నారు. కొల్లేరులో పర్యావరణాన్ని పరిరక్షించాలని రేషనలైజ్ చేసి అక్కడ నివాసముంటున్న ప్రజల మరియు ప్రైవేట్ పట్టా, అసైన్మెంట్ భూముల అనుభవదారుల ప్రయోజనాల్ని కాపాడాలని కోరారు. పేదల జీవనాధారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు.
దీర్ఘకాలిక కొల్లేరు సమస్యను పరిష్కరించండి… కేంద్రమంత్రిని కోరిన ఏపీ నేతలు
By admin1 Min Read
Previous Articleనాటక రంగానికి పూర్వ వైభవం…రాష్ట్ర స్థాయిలో ముగ్గురికి, జిల్లా స్థాయిలో 107మందికి కందుకూరి పురస్కారాలు
Next Article మరో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న “బాహుబలి-1”..!