ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. నేడు మరికొన్ని గంటల్లోనే నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకనున్నాయి. ఇది సాధారణ రాక కంటే వారం రోజుల ముందు కావడం విశేషం. ఇక దీంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవలే కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు గోవా, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని కొన్ని భాగాలకు విస్తరించాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే, ఇవి రాయలసీమను నేడు రానున్నాయి.
Previous Articleవైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు
Next Article విడుదలైన అడివి శేష్ ‘డెకాయిట్’ గ్లింప్స్