విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి రాజాపు సిద్ధూ అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. ఈ వినూత్న ఆవిష్కరణను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి అతనిని అభినందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సిద్ధూ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్ధూ రూపొందించిన సైకిల్‌ను స్వయంగా నడిపి తన ఆవిష్కరణలను పరిశీలించారు. అతని ఆలోచనలను మెచ్చుకుని భవిష్యత్తులో సరికొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయాలి అని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా లక్ష రూపాయలు అందించారు. అంతేకాకుండా సైకిల్‌పై సిద్ధూని కూర్చోబెట్టి స్వయంగా నడిపారు. మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం గల ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను స్వయంగా తయారు చేశాడు. ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు