నేడు రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. నా తెలుగింటి ఆడపడుచులకు, నా ప్రియమైన అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నా చెల్లెళ్ల అనుబంధం వ్యక్తం చేస్తూ ‘నీ కోసం నేనున్నాను’ అనే భరోసా కల్పించే శుభ సందర్భమే రాఖీ పర్వదినం. అందుకే రాఖీ పౌర్ణమి మనందరికి ప్రత్యేకం. మీ అందరికి ఒక అన్నగా మీకు రక్షణ కల్పించే, మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది అని రాఖీ పండుగ సందర్భంగా మరో సారి ప్రకటిస్తున్నాను. ఆడబిడ్డల బాగుకోసం అహర్నిశలూ పని చేస్తానని హామీ ఇస్తూ అందరికి మరొక్కమారు రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు రాసుకొచ్చారు.
ఆడబిడ్డల బాగుకోసం అహర్నిశలూ పని చేస్తా… రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read