BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCBలో 39,481 GD కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం గత నెలలో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. అయితే అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో సవరణ చేసుకునేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 7వ తేదీ రాత్రి 11 వరకు మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. గడువు ముగిసిన తర్వాత వచ్చే ఎలాంటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
Previous Articleరేపు ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ
Next Article మోదీ గ్యారంటీ అనేది క్రూరమైన జోక్: ఖర్గే