వరుస సెషన్ల నష్టాల నుండి కోలుకుని నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ను ముగించాయి. కొనుగోళ్ల జోరుతో మొదట లాభాలతో దూసుకెళ్లిన సూచీలు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు మదుపర్ల అమ్మకాలతో స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెషన్ చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా లాభాలు జోరు తగ్గింది.బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ దాదాపు 1100 పాయింట్లకు పైగా లాభపడి 78,451 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో అమ్మకాలతో 239 పాయింట్ల లాభంతో 77,578 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,518 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.42గా ఉంది.మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్.డిఎఫ్.సి బ్యాంక్, సన్ ఫార్మా, టైటాన్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Previous Articleకిమ్ తో రష్యా మంత్రి సమావేశం
Next Article వాడే అసలైన మగాడ్రా బుజ్జి: మహేశ్ బాబు