తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో ప్రమాదాలను నివారించేందుకు అక్కడి ట్రాఫిక్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.డిసెంబర్ 1వ తేదీ నుంచి వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని అధికారులు ప్రకటించారు.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాల్లో వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించి రావాలని బ్యానర్లు, పోస్టర్లను పెట్టారు.
అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.హెల్మెట్ ధరించి వచ్చేవారిని ప్రోత్సహిస్తూ పుష్పాలు, బొమ్మలు అందజేసి స్వాగతం చెబుతున్నారు.డిసెంబర్ 1వ తేదీ నుంచి తరచూ హెల్మెట్ ధరించి వచ్చే వారిని గుర్తించి వారి వాహన నెంబర్లను నమోదు చేసి వాటితో ఒక లాటరీ నిర్వహించనున్నారు.అందులో గెలుపొందిన వారికి పెద్ద ఎల్ఈడీ టీవీని బహుమతిగా అందజే స్తామని తెలిపారు.