అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.
వన్య ప్రాణులు పంటలను నాశనం చేయడం, ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండటం ఓ వైపు… మరో వైపు పొలాల దగ్గర వేసుకున్న విద్యుత్ కంచెలకు వన్య ప్రాణులు చనిపోతున్న క్రమంలో ప్రజల జీవనోపాధులకు, ప్రాణాలకు విఘాతం లేకుండా వన్య ప్రాణులను కాపాడుకోవాలని పవన్ సూచించారు. ప్రజలను రక్షించడంతోపాటు వన్యప్రాణుల భద్రతను చూడటంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
ఏనుగులు వ్యవసాయ భూముల్లోకి రాకుండా కందకాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి ఆ పథకం ద్వారా ఈ పనులను చేపట్టాలని స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ లైన్లను ఇన్సులేట్ చేసి తద్వారా వన్యప్రాణులకు.. ముఖ్యంగా ఏనుగులు ఎక్కువగా ఉండే మండలాల్లో విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదాన్ని నివారించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ అధికారులు రూపొందించిన సోలార్ కంచెలను వేలాడదీసే వినూత్న పరిష్కార మార్గాలను అమలు చేయాలన్నారు. రైతుల ప్రాణాలతోపాటు, వన్యప్రాణుల రక్షణకోసం చేపట్టాల్సిన చర్యలపై నిపుణులతో చర్చించాలని పవన్ ఆదేశించారు.
Previous Articleమీ రోగనిరోధకశక్తి బలోపేతం అవ్వాలి అంటే ?
Next Article ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్: మొదటి గేమ్ గుకేశ్ ఓటమి